31 Jan 2010

చిన్న కథ ... (1)

[ ఈ కథలు నేను విన్న, చదివిన మనసుకు హత్తుకున్న చిన్ని చిన్ని కథలు. మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ  పొందుపరస్తున్నాను. ఇమేవీ నా సొంతం కాదని మనవి ]

త్యాగం :

ఏమీ ఆశించకుండా ప్రేమించడం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఇది. ఇక చదవండి .....


పదేళ్ళ జాన్ తన చెల్లెలితో ఆడుకుంటూ ఉండగా. ఆ పాప పడిపోయి తలకు పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. జాన్ ది తన చెల్లెలి గ్రూప్ రక్తమే. 

"నువ్వు నీ చెల్లెలికోసం కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు జాన్ ని. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు సరే అన్నాడు. ఆ కుర్రవాడి సంశయాన్ని డాక్టర్ మరోలా అర్థం చేసుకున్నాడు. " పెద్ద నొప్పిగా ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది "అని చెప్పాడు. 

తన శరీరంలోంచి రక్తం మెల్లమెల్లగా సీసా లోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గరకు  వచ్చి "లే చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు .. " ఇంకా ఎంతసేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని. 

డాక్టర్ విభ్రాంతుడై, " రక్తం ఇస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నావా?" అని అడిగాడు.... దానికా కుర్రవాడు "అవును" అన్నాడు.

డాక్టర్ గొంతు వణికింది.... "అనుకునే ఇచ్చావా?" అన్నాడు కంపిస్తూ. 
అవును అన్నట్లు తలూపాడు జాన్, అమాయకంగా... 

***********************************

4 comments:

  1. ఎంత నిష్కల్మషమైన, నిస్వార్ధమైన, స్వచ్చమైన ప్రేమ..! మనం పిల్లల్ని చూసి నేర్చుకోవాల్సినవి చాలానే ఉంటాయి.
    చక్కటి కథని చెప్పారు. అభినందనలు.

    ReplyDelete
  2. @మధురవాణి
    Thank you ! andi :)

    ReplyDelete