28 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (1)

ప్రతి దినం ఒక గీతా శ్లోకం, దాని అర్ధం మరియు సంగ్రహం గా దాని వివరణ చెప్పుకుందాం .... 
నేటి శ్లోకం .... ( గీత లో మొట్ట మొదటి శ్లోకం తో మొదలు పెడుతున్నాము )

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

[ సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుని కరుణతో తానున్న ప్రదేశము నుండియే కురుక్షేత్ర యుద్ధమును చూడగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు సంజయునిని ఈ విధముగా అడుగుచుండెను ]

ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

ధృతరాష్ట్రుడు ఈ విధముగా అడుగుట లో ఒక ప్రాముఖ్యత వుంది. యుద్ధము జరుగు ప్రదేశము దేవతలకు సైతం పూజనీయ స్థానమైన కురుక్షేత్రం. స్వభావరీత్యా ధర్మాత్ములైన పాండవులకు ఆ కురుక్షేత్ర స్థల ప్రభావము అనుకూలముగా ఉంటుందని  అతనికి తెలుసు. అందువలన తన పుత్రులైన కౌరవుల యొక్క విజయావకాశాములపై అతనికి గొప్ప సందేహం ఉంది. అటువంటి సందేహముతోనే ధృతరాష్ట్రుడు సంజయుడిని " వారు ఏమి చేసిరి ?" అని ప్రశ్నిస్తున్నాడు. అధర్మ పరాయణులైన వ్యక్తులకు తాము ఆచరించే పనులయందు విజయముపై ఎంత సందేహాస్పదులుగా ఉంటారో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మనకు తెలియచేస్తున్నది.

రేపు మరియొక శ్లోకంతో మీ ముందుంటాను... సెలవు.

6 comments:

  1. ఓ సారిటు చూడండి.

    http://geetaamrutham.blogspot.com/

    ReplyDelete
  2. ధృతరాష్ట్రుని వాక్యము|
    కం.
    శ్రీకరమగు కురుభూమిని
    నా కుఱ్ఱలఁ దొడరి పాండునందనులు రణో
    త్సేకమున నే మొనర్చిరొ
    వాకొనుమా సంజయా ! కృపామతి నాకున్. ౧

    ReplyDelete
  3. ధన్యవాదములు మూర్తి గారు. మీరు పైన ఇచ్చిన బ్లాగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరముగా ఉన్నది. మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండండి.

    ReplyDelete
  4. mee 'GEETA' chaala bavundi.
    'Vandanaalu mee sramaki..

    ReplyDelete